Advertisement

రిజర్వేషన్ల కోసం కులహోదా తగ్గించుకుంటారా!

Mon 20th Jun 2016 07:51 AM
kaapu,reservation,degrade,bc,kapu leaders,jobs  రిజర్వేషన్ల కోసం కులహోదా తగ్గించుకుంటారా!
రిజర్వేషన్ల కోసం కులహోదా తగ్గించుకుంటారా!
Advertisement

ఆంధ్రప్రదేశ్ లో కాపు కులస్తులు అగ్రవర్ణంగా ఉన్నారు. ఆర్థికంగా వారిలో చాలామంది బావున్నారు. రాజకీయంగా మంచి హోదాలో ఉన్నారు. అయితే కాపు యువత మాత్రం నిరుద్యోగంతో బాధపడుతున్నారు. వీరికి ఉద్యోగాలు వచ్చే మార్గాన్ని కుల పెద్దలు ఆలోచించాలి. ఆర్థికంగా పైకి రావడానికి చేయుత నివ్వాలి. ఫీజు రియంబర్సమెంట్ వంటి పథకం వల్ల అగ్రవర్ణ కులస్తులు కూడా ఉన్నత చదువుకు అవకాశం ఉంది. వీటిని ఉపయోగించుకోవాలి. అంతేకాని రిజర్వేషన్ల కోసం కుల హోదాను తగ్గించుకోవడం అంటే తమ ఆత్మను చంపుకున్నట్టేనని కాపు వర్గాలనికి చెందినవారే బాహటంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా... ఈ ప్రశ్న ఉద్యమాన్ని నడుపుతున్న నేతలు ఆలోచిస్తున్నట్టు లేదు. సమాజంలో కుల హోదాను తగ్గించుకుంటే వారికి ఇప్పటికే ఉన్న బి.సి.ల నుండి మరింత పోటీ ఉంటుంది. పైగా రిజర్వేషన్లు అనేవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం. ఇప్పటి యువత సాఫ్ట్ వేర్ రంగంవైపు చూస్తోంది. అక్కడ ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది కానీ రిజర్వేషన్ల వల్ల కాదనే విషయాన్ని కాపు యువత గ్రహిస్తే మంచిది.

కాపు ఉద్యమాన్ని రాజకీయ నిరుద్యోగులు నడిపిస్తున్నారనేది వాస్తవం. ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ములేని నాయకులంతా ఒక్కచోట చేరి నాటకం రక్తి కట్టిస్తున్నారు. దీని పర్యవసానం వారు ఊహించడం లేదనే విమర్శలున్నాయి. చంద్రబాబును ఇరుకున పెట్టే ఉద్దేశమే కనిపిస్తోందనే ఆరోపణలు సామాన్యలు సైతం గ్రహిస్తున్నారు.  చంద్రబాబు కాపుల గురించే కాకుండా ప్రజలకు ఉపయోగపడే అనేక వాగ్దానాలు చేశారు.వాటిలో నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వృద్ధులకు ఫించను వంటివి ఉన్నాయి. వీటి అమలుకు కాపు నేతలు డిమాండ్ చేస్తే తమ సామాజిక వర్గానికి కొంతైనా ప్రయోజనం అనే విషయాన్ని నేతలు గ్రహిస్తున్నట్టు లేదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement