చిరుని చూసి ఎందుకు భయపడుతున్నారు?

అవును మన మెగా హీరోలు చిరంజీవిని చూసి భయపడుతున్నారట. ఎందుకంటారా చిరు డాన్స్ చూసి.  చిరంజీవిని డాన్సు లో బీట్ చెయ్యడం ఎవ్వరివల్లా కాదనేది నగ్న సత్యం. ఎంత గొప్ప డాన్సర్స్ వచ్చినా చిరంజీవిని తలదన్నే వారే లేరు. అయితే ఇప్పుడు కథంతా ఎందుకంటే ఆయన తన 150 వ చిత్రం కోసం ఒళ్ళు తగ్గించే పనిలో ఉన్నాడట. ఆ ఒళ్ళు తగ్గడానికి చిరంజీవి ఏ జిమ్ములకు వెళ్ళడం లేదట. తనకు తెలిసిన విద్యనే అభ్యసిస్తున్నాడట. ఇంతకి చిరు ఒళ్ళు తగ్గించడానికి ఎన్నుకున్న మార్గం ఏమిటి అనుకుంటున్నారా..ఇంకేముంటుంది..డాన్స్. చిరు తన ఇంట్లోనే డాన్స్ రూంలో డాన్స్ ప్రాక్టిస్ చేస్తున్నాడట. చిరంజీవి చేసే స్టెప్స్ చూసి రామ్ చరణ్, అల్లు అర్జున్ లు భయపడుతున్నారట. డాన్సులో ఆయన వారసత్వం అందుకోగలరేగాని ఆయనలా ఎవ్వరూ డాన్స్ చెయ్యలేరని తెలుసుకుని చిరంజీవి దగ్గర వాళ్ళు డాన్స్ లో ఉన్న కిటుకులు, మెలకువలు నేర్చుకుంటున్నారట. దట్ ఇజ్ చిరు. 

chiranjeevi
dance practice
150th movie
mega star
allu arjun
ram charan
fear
Advertisement
Advertisement