ఫ్యాన్సీ రేట్ కి 'అ ఆ' అమ్ముడిపోయింది!

ఏ సినిమా శాటిలైట్ హక్కులు కొనుక్కోవాలనుకున్నా.. ముందుగా సినిమాలో స్టార్ కాస్ట్ చూస్తారు. స్టార్ హీరో ఉన్నాడా.. లేదా..? అనేదే మొదటి పాయింట్. అలానే స్టార్ డైరెక్టర్ సినిమా అయితే కాస్టింగ్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఇలా హీరో, డైరెక్టర్ ను బేస్ చేసుకొనే సినిమా శాటిలైట్ బిజినెస్ జరుగుతుంటుంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా.. త్రివిక్రమ్ క్రేజ్ చూసి తను రూపొందించిన 'అ ఆ' సినిమాను భారీ రేట్ కు ఓ టీవీ చానెల్ దక్కించుకుంది. సుమారుగా 6 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రేట్స్ అమ్ముడిపోయాయి. అలానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా వెయ్యి థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా సుమారుగా ముప్పై కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.  దీంతో మరోసారి త్రివిక్రమ్ తన క్రేజ్ ఏంటో..? చూపించాడు.  

a aa movie
nithin
trivikram srinivas
satellite rights
Advertisement
Advertisement