శ్రుతికి కొత్త సమస్యలు..!

CineJosh news

కమల్ హాసన్ కూతురిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ కు అక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో టాలీవుడ్ కు తన మకాం ను మార్చుకుంది. 'గబ్బర్ సింగ్','రేసుగుర్రం','శ్రీమంతుడు' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి 'ప్రేమమ్' సినిమాలో నటిస్తోంది. మొన్నామధ్య సినిమాల్లో గ్లామరస్ కనిపించడంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తెరపై కాస్త పద్దతిగా కనిపించే శ్రుతి బయట మాత్రం హాట్ గా కనిపించడానికే ఇష్టపడుతుంది. రీసెంట్ గా ఈ భామ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ ఇచ్చింది. తన క్లీవేజ్ షోతో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఫోటో షూట్ తనకు కొన్ని సమస్యలను తెచ్చి పెట్టింది. ఆ ఫోటో షూట్ మేకింగ్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో శ్రుతిని కాస్త అభ్యంతరకరంగా చూపించడంతో ఈ విషయం శ్రుతిహాసన్ వరకు వెళ్ళింది. తన పర్మిషన్ లేకుండా మేకింగ్ వీడియోను పోస్ట్ చేయడంతో ఆగ్రహించిన శ్రుతి తనను షూట్ చేసిన మ్యాగజైన్ సంస్థ మీద కేసు పెట్టే ఆలోచనలో ఉందట. ఇది ఇలా ఉంటే మ్యాగజైన్ సంస్థ వారు తాము ఎలాంటి వీడియోలను నెట్ లో పోస్ట్ చేయలేదని కావాలనే ఎవరో ఇలా చేసి ఉంటారని అంటున్నారు. ఆ వీడియోలను తీయించే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెబుతున్నారు. మరి శ్రుతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!

sruthihassan
hot photo shoot
magazine
making video