Advertisement

మిక్కీకు మరో మంచి అవకాశం!

మిక్కీజెమేయర్‌... తనదైన శైలిలో సంగీత ప్రియులను అలరించే సంగీత దర్శకుడు. ఆయన సంగీతం అందించిన 'హ్యాపీడేస్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలు మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అ..ఆ' లకు సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఆయనకు మరో మంచి అవకాశం లభించింది. త్వరలో ప్రారంభం కానున్న వరుణ్‌తేజ్‌-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రానికి సంగీతం అందించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ డిఫరెంట్‌ లుక్‌తో హాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్న ఫొటోలు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రమైనా తనకు మంచి కమర్షియల్‌ బ్రేక్‌ను ఇస్తుందనే ఆశతో శ్రీనువైట్ల , వరుణ్‌తేజ్‌లు ఎదురుచూస్తున్నారు. 

mikki j meyar
brahmothsawam
a aa movie
srinuvaitla
varun tej