మ‌హేష్ కూతురు భ‌లే ఫిట్టింగెట్టింది!

Thu 17th Mar 2016 09:18 PM
mahesh babu,samantha,sitara,baby,brahmotsavam movie sets,samantha with sitara  మ‌హేష్ కూతురు భ‌లే ఫిట్టింగెట్టింది!
మ‌హేష్ కూతురు భ‌లే ఫిట్టింగెట్టింది!
Advertisement

నాతో ఆడుకోవాలంటే నువ్వొక్క‌టే కాదు, వెంట నీ బేబీని కూడా తీసుకురావాలి అని చెప్పింది మ‌హేష్ కూతురు సితార‌. పెళ్ల‌యిన ఏ ఆంటీకో ఆ మాట చెప్పుంటే వాళ్లు నిజంగానే వాళ్ల బేబీతో క‌లిసి సితార ద‌గ్గ‌రికి వెళ్లేవాళ్లు. కానీ సితార ఈ ఆర్డ‌ర్ వేసింది ఎవ‌రికో తెలుసా? స‌మంత‌కి. అవును.. మ‌రీ! సామ్ ఇటీవ‌ల  'బ్ర‌హ్మోత్స‌వం' సెట్లో సితార క‌నిపించ‌గానే ద‌గ్గ‌రికి తీసి ముచ్చ‌ట్లు చెప్పింది. మ‌నిద్ద‌రం ఆడుకుందామా అని కూడా  అడిగింది.  సితార...  ఓ ఎస్ అని చెప్పింది. అయితే నేను శ‌నివారం ఖాళీగా ఉంటాను కాబ‌ట్టి ఆ రోజు ఆడుకుందామ‌ని స‌మంత చెప్పింద‌ట‌. స‌రే కానీ... వ‌స్తూ వ‌స్తూ నువ్వు నీ బేబీతో క‌లిసి రావాలి అని చెప్పిందట సితార‌. 

అస‌లే పెళ్లి కాని స‌మంత‌. కానీ సితార అమాయ‌కంగా ఆ ఫిట్టింగ్  పెట్టేస‌రికి స‌మంత విస్తుపోయింద‌ట‌. కానీ క్యూట్ సితార అలా అడిగేస‌రికి స‌రే, నేను బేబీతో క‌లిసే వ‌స్తాన‌ని స‌మంత మాటిచ్చింద‌ట‌. అందుకే శ‌నివారం లోపు నాకొక బేబీ కావాలి, ఇప్పుడేం చెయ్యాలి అంటూ స‌మంత ట్విట్ట‌ర్‌లో అడిగింది. అవును క‌దా... రాత్రికి రాత్రే స‌మంత మాత్రం బేబీని ఎక్క‌డ్నుంచి తీసుకొస్తుంది. కానీ హీరోయిన్ క‌దా ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది. ఏదైనా ఆట‌బొమ్మ‌నో, టెడ్డీ బేర్‌నో తీసుకెళ్లి ఇదే నా బేబీ అని చెబుతుందేమో చూడాలి.


Loading..
Loading..
Loading..
advertisement