మెగాక్యాంప్‌ హీరోతో మరోసారి..!

మెగాక్యాంప్‌లో ఓ సారి వర్క్‌ చేస్తే ఇక వారు ఆ ఫ్యామిలీలోనే ఎక్కువగా కంటిన్యూ అవుతారని అందరికీ తెలిసిన విషయమే. అది దర్శకులైనా, హీరోయిన్లు అయినా సరే. కాగా రామ్‌చరణ్‌ నుండి వరుణ్‌తేజ్‌ వరకు తమ కాంపౌండ్‌లోకి ఎంటర్‌ అయిన వారికి మెగా క్యాంపు పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంది. శృతిహాసన్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌లను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాగా త్వరలో ప్రారంభం కాబోయే బన్నీ-విక్రమ్‌కె.కుమార్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రంలో ఈ రెండుభాషల్లో పాపులారిటీ ఉన్న ఓ అమ్మడుకు చాన్స్‌ ఇవ్వాలని మెగాకాంపౌండ్‌ భావిస్తోందిట. ఆమె ఎవరో కాదు బ్రిటన్‌ బ్యూటీ అమీజాక్సన్‌. ఈమె గతంలో రామ్‌చరణ్‌, బన్నీల కాంబినేషన్‌లో వచ్చిన 'ఎవడు' చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన ఓ పాత్రను చేసింది. ఇప్పుడు అదే భామతో ముందుకు వెళ్లితే ఎలా ఉంటుంది? అనే విషయంలో బన్నీ, విక్రమ్‌కుమార్‌లు తీవ్రకసరత్తు చేస్తున్నారట. 

amy jackson
mega heroes
ram charan
allu arjun