వరుణ్ తేజకు ఇది ఎదురు దెబ్బేనా?

CineJosh news

ఈరోజు వరుణ్ తేజ్ మూడో సినిమా లోఫర్ రిలీజ్ అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టాక్ ఇంకా బయటకి రాలేదు. మెగా హీరోల సినిమాలకు ఓపెనింగ్ రోజుల్లో కలెక్షన్ల వర్షం కురిసేది వారికుండే అభిమానగణం వల్లే. కేవలం మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మీదే రికార్డు కలెక్షన్లు నమోదు కావడం ఎన్నో సార్లు చూసాము. కానీ వరుణ్ తేజకు మొదటి నుండి మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ మద్దతు పెద్దగా లభిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. కంచెలాంటి అత్యద్భుతమైన చిత్రం పడినా ఒక్క చిరంజీవి తప్ప దీని గురించి ఎవరూ మాట్లాడింది లేదు. లోఫర్ విషయంలో కూడా దర్శకుడు పూరీ, నిర్మాత కళ్యాణ్ పదేపదే చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి వరుణ్ తేజను మెగా స్టార్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు అన్న కలరింగ్ ప్రేక్షకులకు కలిగేలా చేస్తున్నారే తప్ప  రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తదితరాల నుండి మచ్చుకైనా వరుణ్ విషయంలో ఒక్క మాటా వినిపించడం లేదు. లోగుట్టు ఎవరికి తెలుసన్నది ఇక్కడ సందర్భం కాకపోయినా లోఫర్ ఓవరాల్ రెవెన్యూ పైన మెగా అభిమానుల ప్రోత్సాహం లభించకపోతే కమర్షియల్ పంథాలో సత్తా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వరుణ్ తేజకు ఈ చిత్రం ఎదురు దెబ్బేయడం ఖాయం అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

varun tej
loafer
puri jagannath
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026