Advertisementt

హీరోయిన్ల మత్తులో హీరోలు కాదు..డైరెక్టర్లు!

Mon 07th Dec 2015 04:04 PM
directors attraction on heroines,tollywood,directors,heroes,heroines,samantha,tamanna,regina,amy jackson,sampath nandi,trivikram shankar  హీరోయిన్ల మత్తులో హీరోలు కాదు..డైరెక్టర్లు!
హీరోయిన్ల మత్తులో హీరోలు కాదు..డైరెక్టర్లు!
Advertisement
Ads by CJ

ఇంతకాలం హీరోలు మాత్రమే హీరోయిన్ల మత్తులో పడి వరుసగా తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తుండటం, రికమండేషన్‌ చేస్తుండటం చూశాం. తాజాగా మాత్రం హీరోయిన్లు హీరోలను పక్కనపెట్టి దర్శకులను బుట్టలో పడేస్తూ వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. గత రెండేళ్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సమంత మాయలో పడిపోయాడు. వరసగా 'అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్లో సమంతను హీరోయిన్‌గా పెట్టుకున్న త్రివిక్రమ్‌ తాజాగా నితిన్‌తో చేస్తున్న 'అ..ఆ'లో కూడా ఆమెనే పెట్టుకున్నాడు. ఇక 'రచ్చ' సినిమాలో తమన్నాకు అవకాశం ఇచ్చిన సంపత్‌నంది తన తాజా చిత్రం 'బెంగాల్‌టైగర్‌'లో కూడా అదే భామను రిపీట్‌ చేస్తున్నాడు. సాధారణంగా హీరోలను తప్ప హీరోయిన్లను రిపీట్‌ చేసే అలవాటులేని డైరెక్టర్‌ శంకర్‌ 'ఐ' చిత్రం తర్వాత తాను తీయబోతున్న 'రోబో2'లో కూడా రజనీ సరసన అమీజాక్సన్‌ను రిపీట్‌ చేస్తున్నాడు. 'పిల్లా ..నువ్వులేని జీవితం'లో రెజీనాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు రవికుమార్‌చౌదరి తన తాజా చిత్రం 'సౌఖ్యం'లో కూడా గోపీచంద్‌ సరసన రెజీనాకే అవకాశం ఇవ్వడం విశేషం. 'సికిందర్‌' చిత్రం ఫ్లాప్‌ అయినప్పటికీ సమంతతో ఆల్‌రెడీ 'మనం' చిత్రం చేసిన విక్రమ్‌ కె.కుమార్‌ తన తాజా చిత్రం '24'లో కూడా సమంతకే చోటిచ్చాడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో సమంతను తీసుకున్న శ్రీకాంత్‌ అడ్డాల 'బ్రహ్మూెత్సవం'లో కూడా ఆమెకే ఓటు వేశాడు. మొత్తానికి మన డైరెక్టర్లు తమకు నచ్చిన హీరోయిన్లకు వన్స్‌మోర్‌ చెబుతూ, బాగా కనెక్ట్‌ అయిపోతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ