ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బాలయ్య సినిమాలో అతడిని పోలిన పాత్ర..!

ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన 'లయన్' చిత్రంలో జె.డి.లక్ష్మీనారాయణను పోలిన పాత్రను బాలయ్య పోషించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన నటిస్తున్న 'డిక్టేటర్' చిత్రంలో సోనియాగాంధీ అల్లుడు. ప్రియాంకా భర్త రాబర్ట్ వాద్రాను పోలిన పాత్రను సృష్టించినట్లు సమాచారం. యుపీఏ గవర్నమెంట్‌లో అన్ని చక్రాలను తిప్పి అందినకాడికి దోచుకున్న రాబర్ట్ వాద్రాపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు విధాలుగా పరోక్షంగా తమకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అవినీతితో లాభపడిన రాబర్ట్ వాద్రాను ఈ చిత్రంలో ఎవరి చేత? ఎలా? చూపించనున్నారో తెలియాల్సివుంది.
balakrishna
dictator movie
robert vadra role
sonia gandhi







































