నాని మరో చిత్రం ఖరారు..!

ప్రస్తుతం యంగ్‌హీరో నాని కెరీర్‌ జోరుగా సాగుతోంది. వరుసగా ఆయన కొత్త సినిమాలకు కమిట్‌మెంట్లు ఇస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఫ్యాన్‌గా నాని నటిస్తున్న చిత్రం వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు రెడీ అవుతోంది. కాగా త్వరలో నాని హీరోగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఇతను ఆమధ్య వచ్చిన స్నేహగీతం సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. మరోవైపు నానికి అష్టాచెమ్మాతో మంచి గుర్తింపును తీసుకొని వచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి నాని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇందులో నాని సరసన ఇద్దరమ్మాయిలు నటించనున్నారు. బీరువా ఫేమ్‌ సురభితో పాటు మలయాళ ముద్దుగుమ్మ నివేద థామస్‌లతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించనున్నాడు. మొత్తానికి భలే భలే మగాడివోయ్‌ తో నాని 25కోట్ల క్లబ్బులో చేరడంతో ఆయన ఫేట్‌ మారిపోయింది. యంగ్‌హీరోల్లో నాని ముందు వరుసలో దూసుకుపోతున్నాడు. 

nani
ashtachamma
bhale bhale magadivoy
venky atluri