Advertisementt

మెగాబ్రదర్స్‌ వర్సెస్‌ అక్కినేని బ్రదర్స్‌..!

Mon 28th Sep 2015 12:20 PM
ajhil movie,akhil,ram charan,brucelee,nagachaitanya  మెగాబ్రదర్స్‌ వర్సెస్‌ అక్కినేని బ్రదర్స్‌..!
మెగాబ్రదర్స్‌ వర్సెస్‌ అక్కినేని బ్రదర్స్‌..!
Advertisement
Ads by CJ

కొన్నిసార్లు సినిమాల విడుదలలో కొన్ని వింతలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆటోమేటిగ్గా ఇతరుల సినిమాలతో అనుకోని పోటీ వచ్చిపడుతుంది. ప్రస్తుతం అలాంటి యుద్దమే మెగాబ్రదర్స్‌, అక్కినేని బ్రదర్స్‌ మధ్య చోటు చేసుకోనుంది. దసరా కానుకగా మెగాహీరో రామ్‌చరణ్‌ నటించిన బ్రూస్‌లీ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం విడుదలైన ఒక వారం గ్యాప్‌లోనే అక్కినేని అఖిల్‌ నటించిన అఖిల్‌ చిత్రం విడుదలకానుంది. ఇక దీపావళి సీజన్‌లో కూడా ఇలాంటి పోరే మరోటి ఎదురుకానుంది. మెగాబ్రదర్‌ వరుణ్‌తేజ్‌ నటించిన కంచె చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 11న విడుదలకు సిద్దమవుతుండగా, అఖిల్‌ అన్నయ్య నాగచైతన్య నటిస్తోన్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రం కూడా అదే సీజన్‌లో మంచి ముహూర్తం చూసుకుంటోంది. సో.. ఈ రెండు పండగల సీజన్లు మెగా అన్నదమ్ములు, అక్కినేని బ్రదర్స్‌ మధ్య పోటీకి రంగం సిద్దమవుతోంది. మరి ఈ నాలుగు పోటీ సినిమాలలో ఏయో చిత్రాలు విజయం సాధించి ప్రేక్షకులను మెప్పిస్తాయో వేచిచూడాల్సివుంది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ