Advertisement

అమలకు నాగ్ స్పెషల్ గిఫ్ట్!

హీరోయిన్‌, బ్లూక్రాస్‌ నిర్వాహకురాలు, కింగ్‌ నాగార్జున శ్రీమతి అమల అక్కినేని పుట్టినరోజు సెప్టెంబర్‌ 12. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి అమలకు కింగ్‌ నాగార్జున ఒక పాటను బర్త్‌డే గిఫ్ట్‌గా అందించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిర్మల కాన్వెంట్‌. ఈ చిత్రంలోని ఒక్కోసారి ఓ ముద్దు... ఒక్కోచోట ఓ ముద్దు..ఒక్కోలాగ ఓ ముద్దు.. అనే పాటను కింగ్‌ నాగార్జున అమలకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 

nagarjuna
amala
birthday gift
nirmala convent movie