ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'సర్దార్ గబ్బర్‌సింగ్'కు సూపర్ క్రేజ్!

మొత్తానికి తమ అభిమాన హీరో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకొంటుండటం పవన్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ అద్బుతంగా ఉండటంతో ఆయన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా ఉంది. ఫస్ట్‌లుక్‌లో కనపరిచిన కొత్తదనమే సినిమాలో కూడా ఉంటే ఇక తమ చిత్రానికి తిరుగుండదని మెగాభిమానులు ఆశపడుతున్నారు. కాగా పవన్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆయన అభిమానుల క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం ఇప్పటికే ఇదే లుక్‌ను టీషర్ట్స్‌పై ముద్రించి విక్రయిస్తున్నారు. అంతేకాదు.. ఆయన అభిమానులు తమ బైకుల మీద, కార్ల మీద కూడా నెంబర్ ప్లేట్స్‌లో ఇదే స్టిల్‌ను వాడుతుండటం చూస్తే ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
sardhar gabbar singh
sardaar gabbar singh
pawan kalyan
bobby
number plates








































