Advertisementt

మామను మించిన అల్లుడు!

Sat 25th Jul 2015 04:39 AM
dhanush,maari movie,unit members,rajinikanth  మామను మించిన అల్లుడు!
మామను మించిన అల్లుడు!
Advertisement
Ads by CJ

ఓ సినిమా హిట్టయిదంటే చాలు అది తమ వల్లే అనుకొని మన హీరోలకు కొమ్ములు వస్తాయి. సినిమా విజయం లేదా పరాజయం అనేది టీం వర్క్‌ అనే విషయాన్ని మన హీరోలు మర్చిపోతుంటారు. అయితే దీనికి అతీతంగా కొందరు హీరోలుంటారు. అలాంటివారిలో రజనీ ఒకరైతే, ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఆయన అల్లుడు ధనుష్‌ కూడా చేరాడు. ధనుష్‌ హీరోగా నటించిన ‘మారి’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ఓ మోస్తరుగా ఉందని రివ్యూలు వచ్చినప్పటికీ సినిమాకు వసూళ్లు మాత్రం భారీగా వస్తున్నాయి. ధనుష్‌ నటించిన గత చిత్రాల కలెక్షన్లను ఈ చిత్రం బ్రేక్‌ చేస్తోంది. ఈ ఆనందాన్ని తన టీమ్‌తో కలిసి పంచుకున్నాడు ధనుష్‌. తన టీంలోని అందరినీ తన ఇంటికి పిలిచి మంచి విందు ఇచ్చి, అందరికీ బంగారు చైనులు బహూకరించాడు. దీనితో ఉబ్బితబ్బిబైన ఈ చిత్రం యూనిట్‌ ధనుష్‌ను, ఆయన ఆతిథ్యాన్ని మరవలేమని చెప్పుకుంటూ మామను మించిన అల్లుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ