Advertisementt

చిరు బర్త్‌డే కానుక!

Mon 20th Jul 2015 04:16 AM
chiranjeevi,gabbar singh2,ram charan,sreenuvaitla  చిరు బర్త్‌డే కానుక!
చిరు బర్త్‌డే కానుక!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజును ఈ సారి అత్యంత వైభవంగా జరుపనున్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా ఆయన షష్ఠిపూర్తి వేడుకలకు కూడా భారీ స్థాయిలో జరుపనున్నారు. అదే రోజున చిరు 150వ చిత్రానికి పూజా కార్యక్రమాలు జరుగుతాయని సమాచారం. అదేరోజు పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌2’ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ నటించకపోవడంతో అది డైలమాలో పడింది. తాజా సమాచారం ప్రకారం తన తండ్రి చిరు బర్త్‌డే రోజున రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. సో.. మెగాభిమానులందరూ ఆగష్టు 22 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ