‘బాహుబలి 2’లో సూపర్‌స్టార్‌..!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ మొదటి భాగం ‘ది బిగినింగ్‌’ చిత్రం జులై 10న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం సెకండ్‌పార్ట్‌లో ఓ కీలకమైన పాత్రను ఓ సూపర్‌స్టార్‌ పోషించనున్నాడని సమాచారం. ఆ సూపర్‌స్టార్‌ ఎవరో కాదు.. తమిళ స్టార్‌ సూర్య. ఆయన కోసం రాజమౌళి సెకండ్‌పార్ట్‌లో ఓ కీలకమైన పాత్రలను తీర్చిదిద్దుతున్నాడని సమాచారం. ‘బాహుబలి2’లో సూర్య నటించనున్నట్లు కోలీవుడ్‌ మొత్తం కోడైకూస్తోంది. అదే జరిగితే ‘బాహుబలి2’కు తెలుగుతోపాటు తమిళంలో మరింత క్రేజ్‌ వచ్చే అవకాశం ఉంది. 

bahubali part2
prabhas
rajamouli
surya
rana