ఎన్టీఆర్, చరణ్ హీరోయిన్‌తో నితిన్..?

CineJosh news

నితిన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదిస్తున్నారని సమాచారం. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్ గతంలోనే ఓ చిత్రంలో కలిసి నటించాల్సింది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ముహూర్తం జరుపుకున్న చిత్రం ఆగిపోవడంతో ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అప్పట్లో కథానాయికకు కొంత అడ్వాన్స్ ఇచ్చారు. ఆ చిత్రం ఆగిపోయినా, రకుల్ తో మరో చిత్రం చేసే ఉద్దేశంతో అడ్వాన్స్ వెనక్కి తీసుకోలేదు. తాజా చిత్రంలో రకుల్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. 

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలతో రకుల్ బిజీగా ఉంది. నితిన్, మల్లిడి వేణుల సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటికి చరణ్, ఎన్టీఆర్ చిత్రాలు పూర్తవుతాయి, నితిన్ చిత్రం అంగీకరించే అవకాశం ఉందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. నితిన్ హోం బ్యానర్ శ్రీ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

nithin
rakul preeth singh
ntr
ram charan tej
sresht movies