రాధిక ఆప్టే న్యూడ్ వీడియోపై రచ్చ రచ్చ..!

CineJosh news
రాధిక ఆప్టే.. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించడంతో ఈ ముంబై భామకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఉంది. కొన్ని రోజుల క్రితం రాధిక న్యూడ్ సెల్ఫీ ఫోటోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయ్యాయి. ఫోటోలు లీక్ కావడం సంచలనం కావడంతో.. న్యూడ్ సెల్ఫీలు నావి కావంటూ రాధిక వివరణ ఇచ్చింది, మార్ఫింగ్ అంటూ గగ్గోలు పెట్టింది. అందరూ నిజమని నమ్మారు. తాజాగా రాధిక ఆప్టే నగ్నంగా నటించిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా హద్దులు మీరి అందాలు ప్రదర్శించిందట. ప్రస్తుతం ఈ న్యూడ్ వీడియోపై రచ్చ రచ్చ జరుగుతుంది. 
నిజమే.. రాధిక ఆప్టే నగ్నంగా నటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం 20 నిమిషాల నిడివి కల షార్ట్ ఫిల్మ్ రూపొందించాం. ఇంటర్నెట్లో లీకయిన వీడియో అందులోదే. నేనే ఆ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించాను. అందరూ మహిళలు ఉన్నప్పుడు ఆ సన్నివేశం చిత్రికరించామని దర్శకుడు అనురాగ్ కశ్యప్ వెల్లడించడంతో రచ్చ ముదిరింది. కళాత్మక దృష్టితో ఆ వీడియో చూడాలని అనురాగ్ చెప్పుకొచ్చారు. 
దర్శకత్వం వహించింది ఓ మగాడే కదా. అందరూ మహిళలు ఉండి ఏం లాభం. కళాత్మక దృష్టితో చూడడానికి నగ్నత్వం తప్ప ఇంకేమి కనబడలేదా..! అంటూ కొందరు అనురాగ్ కశ్యప్, రాధిక ఆప్టేలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ వివాదంపై రాధిక స్పందన కోసం అంతా ఎదురు చూస్తున్నారు. 
radhika apte
anurag kasyap
nude short film
international film festival