నరేష్‌కు హిట్టు వచ్చేనా?

CineJosh news

అల్లరినరేష్‌కు కొంతకాలంగా సరైన హిట్టు రాలేదు. ఆయన నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లుగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి, బందిపోటు’ చిత్రాలైతే ఆయన పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరిచేశాయి. కాగా ఇప్పుడు ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ చిత్రం పేరు ‘జేమ్స్‌బాండ్‌’. దీనికి ఉపశీర్షిక ‘నేను కాదు నా పెళ్లాం’. టైటిల్‌, ఉపశీర్షికలను బట్టి చూస్తే ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’ చిత్రంలో నరేష్‌ సోదరిగా నటించిన కార్తీకలాగానే, ఈ తాజా చిత్రంలో నరేష్‌ భార్య నరేష్‌ను ఇబ్బందుల పాలు చేస్తుందని అర్ధం అవుతోంది. కాగా ఈ చిత్రంలో ‘పోటుగాడు’ ఫేమ్‌ సాక్షిచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల శిష్యుడు సాయికిషోర్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. 

allari naresh
sakshichoudari
jamesbond movie