ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
నాని సరసన బాలీవుడ్ యాడ్ బ్యూటీ!

హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు’ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి.. కాగా ప్రస్తుతం ఆయన ‘భలే భలే మగాడివోయ్’అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నాని సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. త్వరలో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం ముంబై మోడల్ అయిన మెహర్ పిర్జదని సెలక్ట్ చేశారు. ఈ అమ్మాయి వెండితెరకు పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇదే. 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే మెహర్ పిర్జద విశాల్ నటించిన థమ్సప్ యాడ్‌లో నటించింది.
hero nani
hanu raghavapudi
bollywood ad beauty
mehr pirzada in nani movie
mehr pirzada





































