Advertisementt

అఖిల్‌ చిత్రంలో మెరవనున్న రాశిఖన్నా..!

Thu 19th Mar 2015 10:45 AM
akhil,rashi khanna,nithin,sudhakar reddy,item song  అఖిల్‌ చిత్రంలో మెరవనున్న రాశిఖన్నా..!
అఖిల్‌ చిత్రంలో మెరవనున్న రాశిఖన్నా..!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ హీరోగా తెరంగేట్రం చేసే సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. నిర్మాత నితిన్‌, సుదాకర్‌రెడ్డిలు లావిష్‌గా ఖర్చు చేస్తుంటే, వినాయక్‌ డైరెక్షన్‌లో అఖిల్‌ ఇరగదీస్తున్నాడని సమాచారం. కాగా మొదట్లో ఈచిత్రంలో హీరోయిన్‌ పాత్రకు అందాల రాశి రాశిఖన్నాను కూడా వినాయక్‌ నాగార్జునకు సూచించాడని అయితే చివరి క్షణాల్లో ఆ ఛాన్స్‌ ఆమెను మిస్‌ అయిందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఆలోటు తీర్చడానికా అన్నట్లు ఈ చిత్రంలో ఓ ఐటంసాంగ్‌ను రాశిఖన్నా చేత చేయించాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. రాశిఖన్నా కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, అందులో భాగంగానే ఆమె ఇటీవల ఐటంసాంగ్స్‌ వస్తే చేస్తానని మీడియాతో చెప్పిన విషయాన్ని వారు ఉదహరిస్తున్నారు. మొత్తానికి ఈ పాట ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ