Advertisement

'పటాస్' పుణ్యాన బిజినెస్ జరుగుతోంది....!

Sun 01st Mar 2015 12:18 AM
kalyan ram,patas,aniravipudi,share movie,vanya misra  'పటాస్' పుణ్యాన బిజినెస్ జరుగుతోంది....!
'పటాస్' పుణ్యాన బిజినెస్ జరుగుతోంది....!
Advertisement

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన 'పటాస్' చిత్రం అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న మరో చిత్రం 'షేర్'కు బిజినెస్ సందడి మొదలైందని తెలుస్తోంది. 'కత్తి' మల్లి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో మిస్ ఇండియా వన్యమిశ్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది, ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పక్కా మాస్ పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. 'పటాస్' ఇచ్చిన హిట్ తో సంతోషంగా ఉన్న కళ్యాణ్ రామ్ 'షేర్' చిత్రంలో కూడా ఎంటర్ టైన్ మెంట్ పాళ్ళు పెంచడానికి కామెడీ ట్రాక్ లను కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.   

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement