ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
దాసరి, పవన్ సినిమా డైరెక్టర్ ఎవరు..?

'గోపాల గోపాల' సినిమా తరువాత పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్2' సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, దర్శకరత్న దాసరి నిర్మాణ సారధ్యంలో ఓ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ తో 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' సినిమా తీసి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. రీసెంట్ గా 'టెంపర్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు పూరి. చిరంజీవి ఓకే అంటే ఆయన 150 వ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం పవన్, దాసరి కాంబినేషన్ లో వచ్చే సినిమాకి దర్శకత్వం వహించేది పూరినే అని వార్తలు వస్తున్నాయి.ఈ విషయం నిజమైతే పూరి, పవన్ ఫ్యాన్స్ చాలా హ్యాపి కదా..!
pawan kalyan
dasari narayanarao
poorijagannath
chiranjeevi





































