'బాహుబలి'కి దారిచ్చిన నాగ్..!

CineJosh news

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'పై  ప్రేక్షకుల్లోనే కాదు... సినీ ప్రముఖుల్లో కూడా ఎంతో క్యూరియాసిటీ నెలకొని వుంది. ఇటీవల ఈ చిత్రం గురించి నాగ్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించే చిత్రంగా 'బాహుబలి' ఉంటుందనే నమ్మకం ఉంది. ఒకరోజు నేను చేస్తున్న 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం షూటింగ్ లో రమ్యకృష్ణ పాల్గొంది. అయితే అప్పుడే రాజమౌళి ఫోన్ చేసి ఈ రోజు రమ్యకృష్ణ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సివుంది. వీలుంటే ఆమెను మా షూటింగ్ కు పంపగలరా? అని అడిగాడు. వెంటనే నేను మా చిత్రం షూటింగ్ ను క్యాన్సిల్  చేసి రమ్యకృష్ణ ను 'బాహుబలి' చిత్రం షూటింగ్ కోసం పంపించాను.. అని చెప్పుకొచ్చారు. అందుకే నాగ్ ను అందరూ జెంటిల్ మెన్ అని అంటారని, ఇలాంటి స్నేహపూరిత వాతావరణం అందరి మధ్య ఉంటే పరిశ్రమ పచ్చగా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

nagarjuna
soggade chinni nayana
ramyakrishna
bahubali