Advertisement

అగ్గిమీద గుగ్గిలమవుతున్న రేణుదేశాయ్‌..!!

పవన్‌కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. సెలబ్రెటీలపై కామెంట్లు చేసే వారిగురించి మండిపడుతున్నారు. నిజ జీవితంలో సెలబ్రెటీలకు 10 కిలోమీటర్ల దూరం రాలేని వారు కూడా సోషల్‌మీడియాలో వాస్తవాలు తెలుసుకోకుండా రెచ్చిపోతున్నారని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దమ్ముంటే నిజమైన పేర్లు, ఫొటోలు పెట్టి కామెంట్లు రాయాలని, ఫేక్‌ పేర్లతో ఎకౌంట్లు ఓపెన్‌ చేసి కామెంట్లు చేయడం పద్ధతి కాదని చెప్పారు. అయితే రేణుదేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ విడాకులకు సంబంధించి పవర్‌స్టార్‌ అభిమానులు ఆమెపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తుండటంతోనే ఆమె పైవిధంగా స్పందిస్తోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరి నిజమైన పేరు, ఫొటో పెట్టి రేణు గురించి వ్యాఖ్యానాలు చేస్తే.. ఆమె ఎలా స్పందిస్తుందో..??.

renudesai
angrey
twitter
comments
divorce