Advertisement

మొత్తానికి మహేష్ కు అమ్మ దొరికింది..!

Wed 21st Jan 2015 03:06 AM
mahesh babu,koratala siva,combination,gracy singh,lagaan,sridevi,nagarjuna,santhosham,mohan babu  మొత్తానికి మహేష్ కు అమ్మ దొరికింది..!
మొత్తానికి మహేష్ కు అమ్మ దొరికింది..!
Advertisement

మహేష్ బాబు- కొరటాల శివల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో నదియా మహేష్ కు అక్కగా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో మహేష్ తల్లి పాత్ర కోసం ఇప్పటికే దర్శక నిర్మాతలు ఎంతో మందిని సంప్రదించారు. చివరకు అతిలోక సుందరి శ్రీదేవిని సైతం సంప్రదించారు. ఎట్టకేలకు ఈ పాత్రకు గాను గ్రేసీసింగ్ ను తీసుకున్నట్లు సమాచారం. 'లగాన్' చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నాగార్జునతో 'సంతోషం', మోహన్ బాబుతో 'తప్పు చేసి పప్పు కూడు' చిత్రాల్లో నటించింది. వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. మరలా ఈ చిత్రంతో ఆమె మరోసారి టాలీవుడ్ ప్రక్షకులను అలరించడానికి వస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement