Advertisementt

ఆనందం అనుభవించలేకపోతున్నఅమీర్..!

Sat 03rd Jan 2015 03:36 AM
hit,ameerkhan,pk,super hit,collections,gentle man,baba ramdev,bhajaranghdal,theaters,bjp,steady,image,damage    ఆనందం అనుభవించలేకపోతున్నఅమీర్..!
ఆనందం అనుభవించలేకపోతున్నఅమీర్..!
Advertisement
Ads by CJ

ఎవరైనా హిట్ వస్తే ఎగిరి గంతేస్తారు. అయితే అమీర్ ఖాన్ మాత్రం తన సినిమా 'పీకే' సూపర్ హిట్ అయినా, కలెక్షన్లు కొల్లగొడుతున్నా ఆ ఆనందం అనుభవించలేకపోతున్నాడు. తన సినిమా హిందువులను కించ పరిచే విధంగా ఉందని నిరసనలు వెలువడుతున్నప్పటికీ నిన్నటి వారకి ఇష్టం ఉంటె చూడండి.. లేకపోతే మానేయండి.. అంటూ సమాధానం చెప్పాడు. వాస్తవానికి అమీర్ వంటి జెంటిల్ మేన్ నుండి ఇలాంటి సమాధానం ఎవ్వరూ ఊహించలేదు. అయితే బాబా రాందేవ్ నుండి వి.హెచ్.పి. , భజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలు తీవ్రంగా నిరసనను తీవ్రతరం చేయడం , ఆ సినిమా ఆడుతున్న థియేటర్ల పై దాడులకు కూడా వెనకాడకపోవడం, మరోపక్క కేంద్రంలో ఉన్నది హిందూ అనుకూల పార్టీ అయిన బిజెపి ప్రభుత్వం కావడంతో ఆమీర్ ఇప్పుడు ఓ మెట్టుదిగాడు. తనకు అన్ని మతాల మీద గౌరవం ఉందని, హిందువుల మనోభావాలు కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అంటూ అమీర్ మెత్తబడ్డాడు. మొత్తానికి 'పీకే' చిత్రం మాత్రం కలెక్షన్లు ఇప్పటికీ కొల్లగోడుతున్నప్పటికీ.. కలెక్షన్లు స్టడీగా ఉన్నప్పటికీ అమీర్ ఇమేజ్ ను చాలా వరకు డ్యామేజ్ చేసిందని చెప్పక తప్పదు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ