అఫీషియల్: ఆదర్శ కుటుంబం కొత్త డేట్
Adarsha Kutumbam new release date
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ఎంటర్‌టైనర్ మరో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆదర్శ కుటుంబం – AK47 విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రేక్షకులకు సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం – AK47 అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది
















































