అనుష్క శెట్టి ఎక్కడా?
Whats Anushka shetty Future Plans
ఘాటీ పరాజయం తర్వాత స్వీటీ అనుష్క శెట్టి ఎవ్వరికి కనిపించడం లేదు. ఆఖరికి అనుష్క సోషల్ మీడియా నుంచి కూడా బ్రేక్ తీసుకుంది. అసలు అనుష్క మీడియాకి కనిపించి చాలా ఏళ్లు అయ్యింది. స్క్రీన్ పైన కనిపిస్తుంది కానీ, మీడియా ముందుకు రాదు. ఘాటీ లో అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ పై చాలా విమర్శలొచ్చాయి.
దానితో అనుష్క శెట్టి సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంది. బాహుబలి ఎపిక్ ఇంటర్వ్యూలో అనుష్క కనిపించింది. అది కూడా వీడియో లో. ఆతర్వాత అనుష్క హడావిడి లేదు. ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా, నటనను కంటిన్యూ చేస్తుందా, లేదా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.
మరి అనుష్క ఇకపై లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తుందో, లేదంటే సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఒప్పుకుంటుందో తెలియదు కానీ.. అనుష్క పెళ్లి విషయం లోను ఎడతెగని సస్పెన్స్ నడుస్తుంది. మరి అనుష్క దర్శనమెప్పుడో అనేది చూడాలి.








































