హీరో కొత్త రాజకీయం

హీరోలకు పొగరు ఉంటుంది.. ఒళ్ళు బద్ధకం ఉంటుంది.. 'బాబుగారు' అని అనాలి.. కాళ్లకు దండం పెట్టాలి.. దేవుడిలా చూడాలి.. ఇగో టన్నుల కొద్దీ ఉంటుంది.. విజయ్ హీరో కాబట్టి ఈ పొలిటికల్ సినిమా శత దినోత్సవం కూడా ఆడదు.. అని యాంటీ ఫాన్స్ అంటున్నారు. పైన ఫోటో వారు చూడాలి.. ఎప్పుడైనా గెలిచిన పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్ష పార్టీకి చెందిన అధినేత ఇంటికి వెళ్లడం చరిత్రలో చూసామా? విన్నామా కన్నామా? పైగా ఎమ్మెల్యే గా కూడా ఓడిపోయిన వ్యక్తిని కలసి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్న సన్నివేశం ఏ రాష్ట్రంలోనైనా చూసామా? తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒకరినొకరు అసెంబ్లీలోనే పలకరించుకోరు. నాయకులు సరేసరి, పొరపాటున ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యే ను ఏ హోటల్లోనో కలిస్తే ఇంకేముంది చిలువలు పలవలు సృష్టిస్తారు.. ఇక ఒకరి ఇళ్లకు ఇంకొకరు వెళ్లి పలకరించడం ఎక్కడిది?
హీరో విజయ్ అలా కాదు.. తన ప్రమాణ స్వీకార మహోత్సవంలో గవర్నర్ అర్లేకర్ గారికి అడ్డంగా ఉందని కొందరు నేతలు తొలగిస్తుంటే తనే స్వయంగా చేతులు వేసి పక్కన పెట్టారు. సెక్రటేరియేట్ వెళ్లి తన సీటులో కూర్చుంటూ కాసేపు తటపటాయించి ఉద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్ష నేత ఉదయ్ నిధితో మాట్లాడి స్టాలిన్ సమయం తీసుకుని ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. మరో సీనియర్ నేత వైగో గారిని వారింటికి వెళ్లి పలకరించి సహకారం కోరారు. సినిమా హీరోకు భిన్నంగా ఎంతో ఒదిగి విజయ్ తమిళనాట కొత్త సంప్రదాయంకు నాంది పలికారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను ఎత్తి చూపించారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త రాజకీయాలకు తెర తీసిన విజయ్ పరిపాలన ఎలా ఉంటుందో ప్రజల గుండెల్లో హీరో ముద్ర పడిన విజయ్ ముఖ్యమంత్రి గా కూడా హీరో అవుతారా అనేది మున్ముందు తెలుస్తుంది.








































