చరణ్ పెద్ది సెట్స్‌లో క్రికెటర్ తిలక్ వర్మ

Tilak Varma Visits The Sets Of PeddiTilak Varma Visits The Sets Of Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోఎస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన భారత క్రికెటర్ తిలక్ వర్మ సెట్‌ను ప్రత్యేకంగా సందర్శించడంతో ఈ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది.

భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ పెద్ది షూటింగ్ లొకేషన్‌కి వచ్చి టీమ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో ఆ రోజు సెట్స్‌లో సెలబ్రేషన్ వాతావరణం కనిపించింది.

తిలక్ వర్మను టీమ్  ఆత్మీయంగా స్వాగతించింది. సెట్స్ మొత్తం తిరిగి చూసిన ఆయన, ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్షన్ సన్నివేశాలను లైవ్‌గా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్షన్ మాత్రమే కాదు, వాటిలో ఉన్న ఎమోషన్ కూడా ఆయనకు బాగా నచ్చింది.

ఆయన రియాక్షన్ చూసిన తర్వాత టీమ్‌కు మరింత హ్యాపీగా ఫీల్ అయ్యింది. పెద్ది సినిమా రియల్ ఫీల్‌తో, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కూడిన స్పోర్ట్స్ కథగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

సినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. మ్యూజిక్ ప్రమోషన్స్ అద్భుతంగా వున్నాయి. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రై రై రారా” పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

T20 World Cup Star Tilak Varma Visits The Sets Of Ram Charan Peddi

peddi
O.M Review
O.M Review
20 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
20 Nov 2026
DNK Review
DNK Review
20 Nov 2026
GOAT Review
GOAT Review
20 Nov 2026
Scene Review
Scene Review
20 Nov 2026
Ramayana Review
Ramayana Review
20 Nov 2026