ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> AP Govt To Announcd 2.5 lakh Insurance To AP People

ప్ర‌జారోగ్యానికి CM బీమా భ‌రోసా

AP Govt To Announcd 2.5 lakh Insurance To AP PeopleAP Govt To Announcd 2.5 lakh Insurance To AP People

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో `యూనివర్సల్ హెల్త్ కవరేజ్` తీసుకురావాలనే లక్ష్యంతో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద , మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. ప్రతి కుటుంబానికి రూ. 2,50,000 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వైద్య ఖర్చులు భారమై సామాన్యులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో.. కార్పొరేట్ స్థాయి చికిత్సను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.

 

ఈ వినూత్న ఇన్సూరెన్స్ విధానం వల్ల రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత లభించనుంది. గతంలో ఉన్న పరిమితులను పెంచి, మధ్యతరగతి వర్గాలను కూడా ఇందులో చేర్చడం విశేషం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

CM Chandrababu About 2.5 lakh Insurance To AP People

cm chandrababu