ప్రభాస్ తర్వాతే ఎన్టీఆర్

Buchi Babu Next With PrabhasBuchi Babu Next With Prabhas

ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు ఇమ్మిడియట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కథ చెప్పి తన రెండో ప్రాజెక్ట్ కి కమిట్ చేయించుకున్నాడు. ఎన్టీఆర్ కూడా ముందు ఒప్పుకుని తర్వాత తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్ చరణ్ చెంతకు వెళ్ళింది. రామ్ చరణ్ తో బుచ్చిబాబు పెద్ది మూవీ ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో బయటికొస్తున్న కంటెంట్ చూస్తే తెలుస్తుంది.

ఇక పెద్ది తర్వాత బుచ్చి బాబు మరోసారి ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పిస్తాడని చాలామంది అనుకున్నారు. కానీ బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్ అంట. ప్రభాస్ తో సినిమా చెయ్యాలనేది బుచ్చిబాబు కోరికట. సో పెద్ది బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ ఇట్టే ఛాన్స్ ఇచ్చేస్తారు. బుచ్చిబాబు అందుకు పెద్దగా వెయిట్ చెయ్యాల్సిన పని లేదు.

ప్రస్తుతం ప్రభాస్ పలు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నారు. ప్రెజెంట్ స్పిరిట్, ఫౌజీ , కల్కి 2 షూటింగ్స్ చేస్తున్న ప్రభాస్ ఆతర్వాత సలార్ 2, ప్రశాంత్ వర్మ తో ఓ మూవీ చెయ్యాల్సి ఉంది. మరి బుచ్చిబాబు పెద్ది తర్వాత ప్రభాస్ అంటే ఆ సినిమా కోసం బుచ్చిబాబు ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాల్సి ఉంటుందో.

Buchi Babu with NTR Only After Prabhas

buchi babu