PC వండ‌ర్ ఉమెన్ వైబ్స్

Priyanka chopra wonder woman Look

ఇజ్రాయేలీ అందం గాల్ గాడోట్ వండ‌ర్ ఉమెన్ పాత్ర‌లో సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆర‌డుగుల ఈ అంద‌గ‌త్తె యాక్ష‌న్ విజువ‌ల్స్ యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొట్టాయి. దీంతో థియేట‌ర్ల‌కు క్రౌడ్ పోటెత్త‌గా వండ‌ర్ ఉమెన్ చిత్రం బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ కి స‌మీపంగా చేరుకుంది.

 

వండర్ ఉమెన్ (2017) ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు 822.8 మిలియన్ డాల‌ర్లు. 1బిలియ‌న్ కి కేవలం 180 మిలియ‌న్ డాల‌ర్లు త‌క్కువ‌. అయితే ప్ర‌పంచవ్యాప్త వ‌సూళ్ల‌ మొత్తం భార‌తీయ క‌రెన్సీలో సుమారు రూ.6,800 కోట్లు (ప్రస్తుత డాలర్ రేటు ప్రకారం). ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా దర్శకురాలి (ప్యాటీ జెంకిన్స్) సినిమాగా రికార్డు సృష్టించింది.

 

భారతదేశంలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మ‌న దేశంలో మొత్తం వసూళ్లు సుమారు రూ.25 - రూ30 కోట్లు. అప్పట్లో ప్రియాంక చోప్రా నటించిన `బేవాచ్` సినిమాతో పోటీ పడి, దానికంటే మెరుగైన వసూళ్లను రాబట్టింది. వండ‌ర్ ఉమెన్ చిత్రాన్ని 149మిలియ‌న్ డాల‌ర్లు (1200కోట్లు)తో తెర‌కెక్కించ‌గా, 5రెట్లు అధిక వ‌సూళ్ల‌ను సాధించింది. డిసి సినిమాల్లో ఆక్వామ్యాన్, ది డార్క్ నైట్ వంటివి 1 బిలియ‌న్ డాల‌ర్ క్లబ్‌లో ఉన్నాయి. వండర్ ఉమెన్ ఆ స్థాయికి చేరువగా వెళ్లిన సినిమా.

 

గాల్ గాడోట్ `వండర్ ఉమెన్` లాగే ఇప్పుడు ప్రియాంక చోప్రా `ది బ్లఫ్`తో ఆ స్థాయి యాక్షన్ మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. పీసీ న‌టించి `ది బ్ల‌ఫ్` నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ‌వుతుండ‌డంతో క‌లెక్ష‌న్స్ లెక్క‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి రావు. కానీ జ‌నాద‌ర‌ణ ఆ స్థాయిలో ఉందా లేదా? అన్న‌ది ట్రేడ్ నిపుణులు పరిశీలిస్తారు. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా క‌రీబియ‌న్ థ‌గ్ లుక్ లో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ లుక్ ని చూడ‌గానే వండ‌ర్ ఉమెన్ తో పోలిక పెడుతూ ఇన్ స్టాలో ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.

PC wonder woman vibes

priyanka chopra