Advertisementt

స్టైలిష్ విగ్గులు స్టార్ల ట్రెండ్

Sat 14th Feb 2026 02:49 PM
stylish wigs become star trend  స్టైలిష్ విగ్గులు స్టార్ల ట్రెండ్
Stylish Wigs Become star Trend స్టైలిష్ విగ్గులు స్టార్ల ట్రెండ్
Advertisement
Ads by CJ

ఇటీవ‌ల `దురంధ‌ర్` చిత్రంలో న‌టించిన అక్ష‌య్ ఖ‌న్నా `విగ్గు` గురించి చాలా చ‌ర్చ సాగింది. పాకిస్తాన్ గ్యాంగ్ స్ట‌ర్ రెహ‌మాన్ డెకాయిత్ పాత్ర‌లో అత‌డు అద్భుతంగా న‌టించాడు. దానికి తోడు విగ్గు ధ‌రించి అద్భుత‌మైన హెయిర్ స్టైల్ తో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆ లుక్ చూశాక అత‌డి విగ్గు గురించి చాలా చ‌ర్చ సాగింది.

ఇప్పుడు టాలీవుడ్ లో ప్ర‌ముఖ సీనియ‌ర్ హాస్య న‌టుడి విగ్గు ఇప్పుడు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆ విగ్గు వంద‌శాతం అత‌డికి సూటైంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. వెట‌ర‌న్స్ లో దివంగ‌త‌ సూప‌ర్ స్టార్ కృష్ణ‌, సీనియ‌ర్ ఎన్టీఆర్, 70 ప్ల‌స్ లోను సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వంటి వారు అంత‌గా విగ్గు కోసం పాకులాడిన‌ట్టు అనిపించ‌దు. వారంతా ఒరిజిన‌ల్ హెయిర్ తోనే క‌నిపించారు. నిజానికి విగ్గు ధ‌రించ‌కుండా క‌నిపించే స‌త్య‌రాజ్ (బాహుబ‌లి క‌ట్ట‌ప్ప) ధైర్యానికి మెచ్చ‌కుండా ఉండ‌లేం. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో బోలెడంత మంది మ‌హిళా న‌టీమ‌ణుల ఫాలోయింగ్ ఉన్నా కానీ, ఆయ‌న ఏనాడూ విగ్గును ఆశ్ర‌యించ‌లేదు.

అక్ష‌య్ ఖ‌న్నా బాలీవుడ్ లో ఇప్పుడున్న  ఏ స్టార్ హీరోకి లేనంత ఛ‌రిష్మా, న‌ట‌ప్ర‌తిభ అత‌డికి ఉంది. కానీ కేవ‌లం బ‌ట్ట‌త‌ల కార‌ణంగా ద‌శాబ్ధం పాటు ఇంటికే ప‌రిమితమై తీవ్ర ఆవేద‌న తో డిప్రెష‌న్ లోకి వెళ్లారు ఆయ‌న‌. అయినా అత‌డు విగ్గును ఆశ్ర‌యించ‌లేదు..! రెహ్మాన్ డెకాయిత్ పాత్ర కోసం త‌ప్ప‌. సౌతిండియాలో కొంద‌రు స్టార్లు బాల్డ్ హెడ్ స‌మ‌స్య నుంచి తెలివిగా బ‌య‌ట‌ప‌డుతున్నారు. విగ్గు అనే విష‌యం తెలియ‌కుండా మ్యానేజ్ చేయ‌డం వారి గొప్ప‌త‌నం.

అయితే ప్ర‌తి విగ్గు వెన‌క చాలా లెక్క‌లే ఉంటాయి. వంద‌ల కోట్ల బిజినెస్ జ‌రిగే ఈ రంగుల ప్ర‌పంచంలో కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకునే ఈ హీరోలు త‌మ మార్కెట్ రేంజును కాపాడుకునేందుకు చాలా పాట్లు ప‌డాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఒరిజిన‌ల్ రూపంతో క‌నిపించాల‌నే తాప‌త్ర‌యం, నిజాయితీ వారికి ఉన్నా కానీ, మార్కెట్ కి అనుగుణంగా న‌డుచుకోవాల్సి ఉంటుంది. అయినా త‌మ అభిమాన హీరోని అందంగా చూడాల‌ని అభిమానులు కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు. తెర‌పై పాత్ర కోసం విగ్గు ధ‌రించ‌డం కూడా త‌ప్పు కాదు. కానీ వృత్తి లేదా డ్యూటీ నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత, ఇంటికొచ్చాక కూడా వ్య‌క్తిగ‌త జీవితంలోను విగ్గు తో ఉక్క‌పోత భ‌రించాల్సి వ‌స్తే అది ఇబ్బందిక‌ర‌మే. మార్కెట్ కి వెళ్లాల‌న్నా, షాప్ కి వెళ్లాల‌న్నా లేదా పార్కులో జాగింగ్ చేయాల‌న్నా త‌మ రూపాన్ని క‌వ‌ర్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

Stylish Wigs Become star Trend:

Stars Covering with Stylish Wigs

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ