39 వయసుకే నటుడు బలవన్మరణం
South Korean actor Jung Eun-woo dies at 39అతడికి తాను చనిపోతున్నానని ముందే తెలుసు. జీవితం ముగింపులో ఉంది. అది ఈరోజే కావొచ్చు. అందుకే అతడు వింతగా ప్రవర్తించాడు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత కలతను చెప్పకనే చెప్పాడు. ఆర్.ఐ.పి అని రాసుకున్నాడు. మొత్తానికి తన చావుకు తానే సాక్ష్యంగా మిగిలాడు. ఈ నటుడు మరెవరో కాదు. కే -డ్రామా నటుడిగా పాపులరైన జంగ్ యున్ వూ.
కె-డ్రామాలు వన్ వెల్-రైజ్డ్ డాటర్ (2013 నుండి 2014), ది రిటర్న్ ఆఫ్ హ్వాంగ్ గెయుమ్-బోక్ (2015) చిత్రాలలో తన పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన దక్షిణ కొరియా నటుడు జంగ్ యున్-వూ ఫిబ్రవరి 11న మరణించాడు. అతడి వయసు కేవలం 39.
.
ఫిబ్రవరి 10న నటుడు జంగ్ యున్ వూ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మూడు ఫోటోల తోరణం ఉంది. మొదటిది 2003లో 46 సంవత్సరాల వయసులో ఆత్మహత్యతో మరణించిన దివంగత హాంకాంగ్ నటుడు లెస్లీ చియుంగ్. రెండవది 2011లో 27 సంవత్సరాల వయసులో ఆల్కహాల్ విషప్రయోగం కారణంగా మరణించిన దివంగత బ్రిటిష్ గాయని అమీ వైన్‌హౌస్. చివరి ఫోటో తనదే. దీనికి అతడు ఇచ్చిన క్యాప్షన్ లో మిస్టరీ దాగి ఉంది. ``నేను నిన్ను మిస్ అవుతున్నాను.. నేను నిన్ను అసూయపడుతున్నాను.. నేను చింతిస్తున్నాను... PIR.BG`` అని రాసాడు. అయితే ఇందులోని PIR.BG ని తిరగేస్తే GB.RIP .. వెళుతున్నాను.. ఆర్.ఐ.పి అని అతడు స్పష్ఠంగా చెప్పినట్టే. మొత్తానికి తన చావుకు తనే సాక్ష్యంగా మిగిలాడు. తన మరణాన్ని ముందే ధృవీకరించాడు ఈ అభినవ నటుడు. అతడి మరణం దక్షిణ కొరియా కళారంగానికి తీరని లోటు.
Jung Eun-woo passes away at 39 following sudden death






































