మ్యారీడ్ ప్రొడ్యూస‌ర్ కాస్టింగ్ కౌచ్

Wed 12th Nov 2025 09:10 AM
casting couch  మ్యారీడ్ ప్రొడ్యూస‌ర్ కాస్టింగ్ కౌచ్
Married Producer Casting Couch మ్యారీడ్ ప్రొడ్యూస‌ర్ కాస్టింగ్ కౌచ్
Advertisement
Ads by CJ

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ అనుభ‌వాలను ఒక‌ప్పుడు న‌టీమ‌ణులు బ‌హిరంగంగా ఓపెన‌వ్వ‌డానికి భ‌య‌ప‌డేవారు. కొన్నిసార్లు అంత‌ర్గ‌తంగా సినీ పెద్ద‌ల స‌మ‌క్షంలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేవారు. కానీ మీటూ ఉద్య‌మం త‌ర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. చాలా మంది న‌టీమ‌ణులు బ‌హిరంగంగా త‌మ‌కు జ‌రిగిన వేధింపుల ప్ర‌హ‌స‌నం గురించి బ‌య‌ట‌ప‌డుతున్నారు. చాలా మంది క‌థానాయిక‌లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ప‌బ్లిగ్గా మాట్లాడారు.

తాజాగా అందిన ఓ లీక్ ప్ర‌కారం.. ప‌లు తెలుగు, హిందీ చిత్రాల‌లో న‌టించిన పాపుల‌ర్ న‌టి త‌న‌కు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఆవేదన చెందార‌ని తెలిసింది. ఒక పెళ్ల‌యిన నిర్మాత త‌న ఇంటికి వ‌చ్చార‌ని, ఆఫ‌రిస్తాను.. నెల‌వారీ స్టైఫండ్ ఇస్తాను.. నాతో స‌హ‌జీవ‌నానికి వ‌స్తావా? అని త‌న త‌ల్లి ముందే అడిగార‌ని, దాంతో షాక్ లో ఉండిపోయాన‌ని తెలిపారు స‌ద‌రు న‌టీమ‌ణి. అయితే ఆ అవ‌కాశాన్ని తిర‌స్క‌రించానని, ఆ త‌ర్వాత త‌న‌ను ప్రాజెక్ట్ నుంచి తొల‌గించార‌ని తెలిపారు. మ్యారీడ్ ప్రొడ్యూస‌ర్ పేరు చెప్ప‌లేదు కానీ, అత‌డు ప్ర‌ముఖ నిర్మాత అని హింట్ ఇచ్చారు. త‌న త‌ల్లి ముందే అత‌డు అలా అడ‌గ‌డంతో షాక్ కి గుర‌య్యాన‌ని స‌ద‌రు న‌టీమ‌ణి గుర్తు చేసుకున్నారు. అత‌డు పాపుల‌ర్ బ్రాండ్ చీర‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని చెప్పిన‌ట్టు వెల్ల‌డించాడు.

అంతే కాదు.. ఇలాంటి వ్య‌క్తులు కొంద‌రు ముఠాగా ఏర్ప‌డి తిరస్క‌రించిన న‌టిని టార్గెట్ చేస్తార‌ని, అవ‌కాశాలు రాకుండా చేస్తార‌ని, ఇలాంటి అనుభ‌వాలు చాలా మంది న‌టీమ‌ణుల‌కు ఎదుర‌య్యాయ‌ని తెలిపారు. స‌ద‌రు న‌టీమ‌ణి ఎవ‌రు? అన్న‌ది అప్ర‌స్తుతం. వినోద ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశవాదం ఎలా ఉంటుందో స‌ద‌రు న‌టీమ‌ణి ఆవేద‌న బ‌య‌ట‌పెడుతోంది. ప్ర‌స్తుతం ఓటీటీలు స‌హా వెండితెర‌పైనా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్న ఈ న‌టి త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా స‌మ‌స్య‌లు లేవ‌ని తెలిపారు.

Married Producer Casting Couch :

  Actress about her Casting Couch experience                              

Tags:   CASTING COUCH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ