Advertisementt

జెనీలియా కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ దొరికిందా

Sun 20th Jul 2025 04:01 PM
genelia  జెనీలియా కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ దొరికిందా
Is Junior perfect comeback for Genelia జెనీలియా కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ దొరికిందా
Advertisement
Ads by CJ

సై, రెడీ, బొమ్మరిల్లు, ఢీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో హాసిని గా చెరగని ముద్ర వేసిన జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని దాదాపుగా 13 ఏళ్ళ పాటు నటనకు దూరంగా ఉంది. ఇద్దరు మగ పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో జెనీలియా మరోసారి సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యింది.

హిందీలో ఆమిర్ సితారే జమీన్ పర్ చిత్రంతో పాటుగా తెలుగులోకి కిరీటి రెడ్డి జూనియర్ చిత్రాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్ సితారే జామీ పర్  కి మంచి రివ్యూస్, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రాగా.. ఇక్కడ తెలుగులో నిన్న శుక్రవారం విడుదలైన జూనియర్ చిత్రానికి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.

జూనియర్ జెనీలియా కేరెక్టర్ పవర్ ఫుల్ గా బావున్నప్పటికీ.. ఆమెకు పెర్ఫర్మ్ చేసే స్కోప్ ని దర్శకుడు ఇవ్వలేదు. జెనీలియా లుక్స్, ఆమె కేరెక్టర్ కనెక్ట్ అయ్యాయి, కానీ జూనియర్ టాక్ జెనీలియా రీ ఎంట్రీ ని పర్ఫెక్ట్ గా నిలబెట్టలేకపోయింది. జూనియర్ ప్రమోషన్స్ లో జెనీలియా హడావిడి బాగానే చేసింది. ఇకపై ఆమె ఎలాంటి కేరెక్టర్ నైనా ఓకే చేస్తాను అని జూనియర్ ఇంటర్వ్యూలో చెపింది. మరి జెనీలియా కి దర్శకులు ఎలాంటి కేరెక్టర్స్ ప్రిఫర్ చేస్తారో చూడాలి. 

Is Junior perfect comeback for Genelia:

Is It perfect comeback for Genelia

Tags:   GENELIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ