Advertisementt

పసివాడి ప్రాణం కోసం చిన్న సార్ సాయం

Wed 02nd Jul 2025 05:28 PM
nara lokesh  పసివాడి ప్రాణం కోసం చిన్న సార్ సాయం
Nara Lokesh పసివాడి ప్రాణం కోసం చిన్న సార్ సాయం
Advertisement
Ads by CJ

రాజకీయాల్లో నారా లోకేష్ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. మంత్రిగా తన విధులు నిర్వర్తిస్తూనే.. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు నారా లోకేష్. సోషల్ మీడియాలో నారా లోకేష్ పేరును ట్యాగ్ చేస్తూ ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని సహాయం అడగగానే ముందుకొచ్చి తన టీమ్ ని పంపి లోకేష్ వారికి సహాయం చేస్తూ ఉన్నారు, ఆ కోవలోనే పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 

దానితో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది. 

 వైద్యఖర్చులకు గాను రూ.10లక్షల వరకు ఎల్ వోసీ మంజూరుచేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అధికమొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచి ఎల్ వోసీ మంజూరు చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని వెంటనే కలుసుకుని సాయం అందజేయడం గొప్ప విషయమని, ఒక్కరోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

Nara Lokesh:

Nara Lokesh

Tags:   NARA LOKESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ