Advertisementt

మిస్ శెట్టిగా అనుష్క న్యూ లుక్

Wed 08th Mar 2023 06:39 PM
miss shetty mr polishetty  మిస్ శెట్టిగా అనుష్క న్యూ లుక్
Anushka new look in Miss Shetty Mr Polishetty మిస్ శెట్టిగా అనుష్క న్యూ లుక్
Advertisement
Ads by CJ

స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి త్వరలోనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతుంది. అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. పి. మహేష్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా అనుష్క శెట్టి కొత్త పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. 

ఈ పోస్టర్ లో అనుష్క చాలా అందంగా కనిపిస్తోంది. విదేశీ లొకేషన్ లో ఓ బిజీ రోడ్ తనదైన శైలిలో నవ్వుతూ రోడ్ దాటుతున్నట్టుగా ఉంది అనుష్క. హ్యాండ్ బ్యాగ్, ఫుల్ డ్రెస్ లో తన లుక్ కూడా చాలా హాట్ గా ఉంది. క్యాజువల్ అవుట్ ఫిట్ అయినా తన పర్సనాలిటీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి సిద్ధు అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటించారు. 

Anushka new look in Miss Shetty Mr Polishetty:

Miss Shetty Mr Polishetty new poster

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ