ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Arvind Swami As Raju aka Raazu From Custody Unveiled

కస్టడీ: చైతూ విలన్ అరవింద్ స్వామి లుక్

Arvind Swami As Raju aka Raazu From Custody UnveiledArvind Swami As Raju aka Raazu From Custody Unveiled

అక్కినేని నాగ చైతన్య రీసెంట్ మూవీ కష్టడి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న కస్టడీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్ర పోస్టర్ కూడా  క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు మేకర్స్ ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్ రాజు పాత్ర పోషిస్తున్నారు.

అరవింద్ స్వామి లుక్ చాలా పవర్ ఫుల్ గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర పోషిస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఫెరోసియష్ లుక్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. 

Arvind Swami’s Powerful Character Poster As Raju aka Raazu From Custody Unveiled

arvind swami
custody movie