Advertisement

సినీజోష్ రివ్యూ : థాంక్యూ

Fri 22nd Jul 2022 01:21 PM
telugu movie thank you review,thank you movie telugu review,thank you telugu film telugu review  సినీజోష్ రివ్యూ : థాంక్యూ
Thank You Movie Telugu Review సినీజోష్ రివ్యూ : థాంక్యూ
Advertisement

సినీజోష్ రివ్యూ : థాంక్యూ 

నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ తదితరులు 

కథ : బి.వి.ఎస్.రవి 

సంగీతం : ఎస్ ఎస్ థమన్  

ఎడిటింగ్ : నవీన్ నూలి 

ఫోటోగ్రఫీ : పి.సి.శ్రీరామ్  

నిర్మాతలు : దిల్ రాజు - శిరీష్ 

స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విక్రమ్ కుమార్ 

నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 

విడుదల తేదీ : 22-07-2022

ఒకప్పుడు కొత్త సినిమా రిలీజ్ అంటే సగటు ప్రేక్షకులకు థియేటర్స్ లో టికెట్స్ దొరికేవి కావు. కానీ ఇప్పుడు థియేటర్స్ కి ప్రేక్షకులే దొరకని పరిస్థితిని చవిచూస్తోంది సినీ పరిశ్రమ. అందుకే దిమాక్ వున్న నిర్మాత దిల్ రాజు తమ థాంక్యూ చిత్ర విడుదల విషయంలో ముందూ వెనుకలాడారు.. కిందా మీదా పడ్డారు. లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీతో, ఈ ఇయర్ సంక్రాంతికి బంగార్రాజుతో మంచి విజయాలే అందుకుని ఫామ్ లో వున్న నాగ చైతన్య హీరో అయినప్పటికీ నిర్మాత రాజు దిల్ సంకోచిస్తూనే వచ్చింది. సంశయిస్తూనే థాంక్యూని నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆశించిన బజ్ తెచ్చుకోలేకపోయిన థాంక్యూ ఆరంభ వసూళ్లు కూడా అందుకు తగ్గట్టు అంతంత మాత్రంగానే వున్న నేపథ్యంలో... ఇక ఈ చిత్రాన్ని కాపాడాల్సిన క్లిష్ట బాధ్యత కథ, కథనాలదే కనుక అవెలా ఉన్నాయో సమీక్షలో చూద్దాం.!

కథగా...

యు ఎస్ లో యాప్ మేకర్ గా బాగా సక్సెస్ అయిన అభిరామ్ (నాగ చైతన్య) బిజినెస్ మ్యాన్ గా దూసుకుపోతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో అతనిలో అహంకారం పెరుగుతుంది. అవతలి వాళ్ళని వాడుకుని వదిలేసే స్వభావం ముదురుతుంది. అయితే ఒకానొక దశలో ఓ చిన్న సంఘటనతో రియలైజ్ అయిన అభిరామ్ తన మూర్ఖత్వాన్ని తెలుసుకుంటాడు. మూలాల్ని వెతుక్కుంటూ వెళతాడు. అసలతని ప్రీవియస్ లైఫ్ లో ఏం జరిగింది.. ప్రెజెంట్ లైఫ్ లో తన జర్నీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక ప్రియ (రాశి ఖన్నా), పార్వతి (మాళవిక నాయర్) చిన్నూ (అవికా గోర్) పాత్రలు అభిరామ్ లైఫ్ తో ఎలా కనెక్ట్ అయి ఉన్నాయన్నది కూడా అతని ప్రయాణంతో పాటుగా తెరపైకి వస్తూ ఉంటుంది.  

తెరపై....

థాంక్యూ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అండ్ బిగ్గెస్ట్ ఎస్సెట్ రెండూ నాగ చైతన్యే. విభిన్న వయసుల్లో తను తెరపై కనిపించిన తీరుని, వైవిధ్యమైన కోణాలున్న అభిరామ్ పాత్రలో తను చూపించిన అభినయాన్ని అభినందించకుండా ఉండలేం. ముఖ్యంగా ఎక్కడా అసహజత్వం కానరాని తన సిన్సియర్ పెర్ ఫార్మెన్స్ నటుడిగా నాగ చైతన్య ఎంతగా ఎదుగుతూ వస్తున్నాడో చూపిస్తుంది. ప్రియగా రాశి ఖన్నా పాత్ర మేరకు నటిస్తే.. పార్వతిగా మాళవిక నాయర్ మాత్రం ఆ పాత్ర ప్రభావం మరింత పెరిగేలా పెర్ ఫార్మ్ చేసింది. అవికా గోర్ ది అంతంత మాత్రం క్యారెక్టరే. ప్రకాష్ రాజ్ - సంపత్ రాజ్ లకు ఇలాంటి రోల్స్ చేయడం రొటీనే కనుక ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు.

తెర వెనుక....

పైన కథ గురించి చదవగానే అందరికీ టక్కున ఇదేదో ఆటోగ్రాఫ్ స్టోరీలా ఉందే అనిపించొచ్చు. నిజమే. ఆటోగ్రాఫ్ తరహా సినిమా చెయ్యాలనే తాపత్రయంతో ఇప్పటికే పలువురు ప్రయత్నించి విఫలమైనా ఏ మొండి ధైర్యంతోనో బి.వి.ఎస్.రవి మళ్ళీ అదే కథని రాసుకున్నాడు. అంతేకాదు.. ఆల్ రెడీ ఇదే దారిలో వెళ్లి ప్రేమమ్ అనే సినిమా చేసేసి ఉన్న నాగ చైతన్యనీ, బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకున్న విక్రమ్ కుమార్ నీ, కథల ఎంపికలో రాటుదేలిన దిల్ రాజు వంటి నిర్మాతని కూడా అదే వీక్ సబ్జెక్ట్ తో ఓకే అనిపించగలిగాడు. అయితే ఆడియన్స్ ముందు అతని ఆటలు సాగలేదు. ట్రైలర్ చూసినప్పుడే థాంక్యూ అనుకున్న నేటి తరం ప్రేక్షకులు థాంక్యూ థియేటర్స్ వైపుకు దూరం జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మాటల గురించి అయితే అసలు మాట్లాడుకోకపోవడమే బెటర్. థమన్ మ్యూజిక్ లో ఫేర్ వెల్ సాంగ్ ఒకటీ కాస్త ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సో సో గానే సాగింది. ఈ మధ్య కాలంలో థమన్ వీకేస్ట్ వర్క్ ఇదే. టెక్నిషియన్స్ లో థాంక్యూ చెప్పించుకునే ఏకైక వ్యక్తి సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్. తక్కువ నిడివి ఉన్నా ఎక్కువ భారంగా సాగుతోన్న కథనాన్ని కంటికి ఇంపుగా చూపిస్తూ కూర్చోపెట్టింది ఆయన విజువల్సే. ఫైనల్ గా.. డిఫరెంట్ సినిమాలు మాత్రమే చేసే దర్శకుడు విక్రమ్ కుమార్ వీలైనంత త్వరగా ఈ సినిమా చేశాననే విషయం మర్చిపోవాలని ఆశిద్దాం. నిజంగా మనతో థాంక్యూ చెప్పించుకునే అవుట్ ఫుట్ తో తను త్వరలోనే కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నిర్మాతలు దిల్ రాజు - శిరీష్ ల సినిమా మేకింగ్ లో ఎటువంటి లోపం లేదు కానీ సబ్జెక్ట్ సెలక్షన్ లోనే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అక్కినేని ఫ్యాన్సులో జోష్ నింపలేక, వాళ్ళతో థాంక్యూ చెప్పించుకోలేక రెండుసార్లూ విఫలమైన దిల్ రాజు ఈ అపప్రద పోగొట్టుకోవడానికి ఈసారి మరింత గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తారేమో చూడాలి. 

ఫినిషింగ్ టచ్ : తక్కువ లెంగ్త్ తో సరిపెట్టినందుకు థాంక్యూ.!

సినీజోష్ రేటింగ్ : 1.75/5

Thank You Movie Telugu Review:

Telugu Movie Thank You Review

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement