Advertisement

సిలకా.. సిలకా.. టెన్త్ క్లాస్ డైరీస్ ఐటమ్ సాంగ్

Sun 23rd Jan 2022 10:18 AM
silka silka rama silka item song,tenth class diaries,tent class diaries movie  సిలకా.. సిలకా.. టెన్త్ క్లాస్ డైరీస్ ఐటమ్ సాంగ్
Silka .. Silka .. Rama Silka .. Item song సిలకా.. సిలకా.. టెన్త్ క్లాస్ డైరీస్ ఐటమ్ సాంగ్
Advertisement

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు వంటి మంచి చిత్రాలను అచ్యుత రామారావు నిర్మించారు. ఇప్పుడీ టెన్త్ క్లాస్ డైరీస్తో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, సత్యరాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని ఐట‌మ్ సాంగ్‌ సిలకా... సిలకా... రామా సిలకాను ఈ రోజు విడుద‌ల చేశారు.

సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ రాశారు. రేవంత్ ఆలపించారు. బాహుబ‌లిలో మ‌నోహ‌రి... సాంగ్ త‌ర్వాత రేవంత్ పాడిన ఐట‌మ్ సాంగ్ ఇదే కావ‌డం విశేషం. 

నిర్మాతలలో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ నిర్మాతగా ఇంతకు ముందు రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు చేశాను. రెండూ హ్యాపీ ప్రాజెక్ట్స్. అమెజాన్‌లో వాటికి టాప్ వ్యూస్ ఉన్నాయి. కమర్షియల్ హంగులతో టెన్త్ క్లాస్ డైరీస్ తీర్చిదిద్దాం. సరికొత్త కాన్సెప్ట్ ఇది. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. మనం డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినా... టెన్త్ క్లాస్ అనేది మెమరీ మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమ‌రీస్ మిగ‌తా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ఒక రకంగా లైఫ్ పార్ట్‌న‌ర్ లాంటిది. ఆ నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా, లైవ్లీగా సినిమాలో సన్నివేశాలు ఉంటాయి. ఇదొక మంచి కామెడీ ఎంటర్టైనర్ అని అన్నారు. 

గరుడవేగ అంజి మాట్లాడుతూ సిలకా... సిలకా... రామా సిలకా... ఏదో ఉందే మెలికా... అంటూ ఇండియన్ ఐడల్ రేవంత్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. సురేష్ బొబ్బిలి మంచి ట్యూన్ ఇచ్చారు. టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఇది మంచి ఐటమ్ సాంగ్. ప్రధాన తారాగణంతో పాటు 150 మంది జూనియర్ ఆర్టిస్టులు, 30 మంది డాన్సర్లపై ఈ పాటను తెరకెక్కించాం. ఇద్దరు ముంబై డాన్సర్లు ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే రోజు (జనవరి 26)న టీజర్ విడుదల చేస్తాం. ఛాయాగ్రాహకుడిగా నా 50వ చిత్రమిది అన్నారు. 

టెన్త్ క్లాస్ డైరీస్ 

తారాగణం: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, సత్యం రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయి రామ్, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), జెమినీ సురేష్, ఓ మై గాడ్ నిత్య, రాహుల్, కంచెరపాలెం కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి

Silka .. Silka .. Rama Silka .. Item song:

 Silka ... Silka ... Rama Silka ... Item song released in Tenth Class Diaries

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement