Advertisement

తెలుగు ఆడియెన్స్‌ను ఆహా అనిపిస్తోన్న అఖిల్

Sat 20th Nov 2021 06:49 PM
akhil,aha ott,pooja hegde,most eligible bachelor on aha,most eligible bachelor movie  తెలుగు ఆడియెన్స్‌ను ఆహా అనిపిస్తోన్న అఖిల్
Most Eligible Bachelor on Aha తెలుగు ఆడియెన్స్‌ను ఆహా అనిపిస్తోన్న అఖిల్
Advertisement

తెలుగువారిని అన్‌లిమిటెడ్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న ఏకైక ఓటీటీ మాధ్య‌మం ఆహా. ప్రేక్ష‌కులు మెచ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌తో పాటు ఎగ్జ‌యిటింగ్ మూవీస్, ఒరిజిన‌ల్స్‌ను అందిస్తూ అంద‌రి ఇంటా ఆహానే..మాట ఆహానే అనే పేరుతో తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ఇప్పుడు ఆహాలో లిస్టులో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ చేరింది. అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొంది అత్యంత అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్ లు, మోడ్ర‌న్ డేస్ రిలేష‌న్‌షిప్స్ మీద ఫోక‌స్ అయిన క‌థ‌, మ‌న‌సును ట‌చ్ చేసే గోపీసుంద‌ర్ మ్యూజిక్‌... థియేట‌ర్ల‌లో జ‌నాల‌తో ఆహా అనిపించుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ ..ఈ  శుక్ర‌వారం(న‌వంబ‌ర్ 19) నుంచి ఆహా ప్రీమియ‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత విడుద‌లైన చిత్రాల్లో ఈ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. అఖిల్‌, పూజాహెగ్డే కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ అయ్యింది. 

యంగ్‌స్ట‌ర్ హ‌ర్ష‌. త‌నకు స‌రైన జోడీని వెతుక్కుంటూ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఇండియాకు వ‌స్తాడు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగినా, పెళ్లికూతురు మాత్రం అత‌ని అభిరుచుల‌కు అనుగుణంగా దొర‌క‌దు. అలాంటి స‌మయంలో అత‌నికి విభ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. జీవితాన్ని ఆస్వాదించే హ్యాపీ గో ల‌క్కీ స్టాండ‌ప్ క‌మెడియన్ విభ‌. ఆమె ప‌రిచ‌యం అయ్యాక హ‌ర్ష‌, జీవితాన్ని చూసే తీరే మారిపోతుంది. ప్రేమ గురించి, బంధాల గురించి అప్ప‌టిదాకా అత‌ని మ‌న‌సులో ఉన్న అభిప్రాయాలు మారుతాయి. 

ఆధునిక జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న రిలేష‌న్‌షిప్ ఇష్యూస్‌ని సెన్సిటివ్‌గా డీల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌. అందులో వినోదం పాళ్లు కూడా ఎక్కువే. సంగీతం కూడా సినిమాకు అత్యంత పెద్ద ప్లస్ పాయింట్‌. ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాష్‌, గెట‌ప్ శీను, సుడిగాలి సుధీర్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇందులో ఈషారెబ్బా, ఫ‌రియా అబ్దుల్లా, శాన్వీ మేఘ‌న‌, రియ‌ల్ లైఫ్ క‌పుల్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌- చిన్మ‌యి స్పెష‌ల్ అప్పియ‌రెన్సులు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌దీప్ వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు క్లాసీ ఔట్‌లుక్ ఇవ్వ‌డంతో పాటు, సినిమా మూడ్‌ని అద్భుతంగా క్యారీ చేసింది.

Most Eligible Bachelor on Aha:

Akhil Most Eligible Bachelor on Aha

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement