Advertisementt

స్టైలిష్ లుక్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

Wed 07th Apr 2021 06:15 PM
akhil akkineni,akhil birthay,most eligible bachelor,akhil birthday special,most eligible bachelor poster,akhil look in stylish  స్టైలిష్ లుక్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
Akhil Birthday Special: Most Eligible Bachelor Poster స్టైలిష్ లుక్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పోస్టర్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో అఖిల్ చాలా స్టైలిష్ లుక్‌తో పాటు నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌.. మొన్న విడుదలైన ఏ జిందగీ పాటకు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంలో ఇప్పుడు బర్త్ డే పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

Akhil Birthday Special: Most Eligible Bachelor Poster:

Most Eligible Bachelor: Akhil Birthday Special 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ