ప్రియమణి ప్రధాన పాత్రలో ‘కొటేషన్ గ్యాంగ్’

Priyamani new Movie Quotation Gang Announced

Tue 08th Sep 2020 08:35 PM
priyamani,new movie,quotation gang,vivek k director  ప్రియమణి ప్రధాన పాత్రలో ‘కొటేషన్ గ్యాంగ్’
Priyamani new Movie Quotation Gang Announced ప్రియమణి ప్రధాన పాత్రలో ‘కొటేషన్ గ్యాంగ్’
Advertisement

ప్రియమణి ప్రధాన పాత్రలో బహుభాష చిత్రం ‘‘కొటేషన్ గ్యాంగ్’’

హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న కొత్త సినిమా ‘‘కొటేషన్ గ్యాంగ్’’.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని ఫిల్మీ నాటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గాయత్రి సురేష్ నిర్మిస్తున్నారు.హిందీ, తెలుగు, తమిళ, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వివేక్.కె డైరెక్ట్ చేస్తున్నారు. ‘‘శ్రీమన్నారాయణ,మిరపకాయ్,పైసా లాంటి సినిమాలను హిందీలో డబ్ చేసిన ఫిల్మీ నాటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించనుంది. ధన్యా రాఫియా బాను, వైష్ణో వారియర్, అక్షయ ఇతర నటీనటులు. వీరితో పాటు, ఓ స్టార్ హీరో కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ మొత్తం ముంబై, తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాలలో జరుగబోతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Priyamani new Movie Quotation Gang Announced:

FILMINATI ENTERTAINMENT TO BEGIN PRODUCTON OF A MULTI LINGUAL GANGSTER MOVIE WITH PRIYAMANI. TITLED QUOTATION GANG


Loading..
Loading..
Loading..
advertisement