ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bomma Adirindi Dimma Thirigindi Movie title Logo released

‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ టైటిల్ లుక్ ఇదే!

షకలక శంకర్ లీడ్ రోల్‌లో రూపొందిన సినిమాకు ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ టైటిల్ లుక్ విడుదల 

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్‌లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటెర్టైనెర్ మూవీకి ‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలానే ప్రముఖ ఫిల్మ్ పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించారు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ ఎంటరైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు తెలిపారు. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే కామెడితో పాటు మరి కొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకుడు కుమారు కోట. షకలక శంకర్ తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్,  రాజు స్వరూప్, స్వాతి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ తాజాగా విడుదల అయింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే అర్థంలో ఎంత ఫన్ ఉందో ఫుల్ సినిమా కూడా అదే రేంజ్‌లో ఉండబోతుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్‌గా చెబుతుంది. 

టైటిల్ లుక్  రిలీజ్ చేసిన సందర్భంగా దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ.. ‘‘బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది డైరెక్టర్‌గా నా తొలి సినిమా, ఈ సినిమాకి ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీని ప్రముఖ పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను అందించారు. అలానే ఆయనే ఈ చిత్రానికి డైలాగ్స్ కూడా అందించారు. మా తొలి ప్రయత్నంగా ఈ సినిమాని ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో రెడీ చేశాము, షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ మాట్లాడుతూ.. ‘‘కొత్త దర్శకుడు కుమార్ కోట, ఏలూరు శ్రీనుగారు రాసిన కథను చక్కగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిన ఏలూరు శ్రీను డైలాగ్స్ అందించారు. వీరిద్దరి టాలెంట్‌తో పాటు షకలక శంకర్ యాక్షన్, కామెడీ తదితర అంశాలు ఈ చిత్రానికి హైలైట్ అవనున్నాయి’’ అని తెలిపారు. 

నటీనటులు 

షకలక శంకర్ 

ప్రియ

అర్జున్ కళ్యాణ్  

రాజ్ స్వరూప్ 

మధు  

స్వాతి 

అవంతిక 

హీనా 

రితిక చక్రవర్తి  

సంజన చౌదరి 

సాంకేతిక వర్గం 

సమర్పణ: మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ 

బ్యానర్: మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ 

నిర్మాతలు: లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు 

లైన్ ప్రొడ్యూసర్: సోమేశ్ ముచ్చర్ల 

పీఆర్ఓ: మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్ 

కెమెరామెన్: ఫణింద్ర వర్మ అల్లూరి 

మ్యూజిక్: పిఆర్ 

స్టోరీ, డైలాగ్స్: ఏలూరు శ్రీను 

డైరెక్టర్: కుమార్ కోట

Shakalaka Shankar new movie Title announced

Bomma Adirindi Dimma Thirigindi Movie title Logo released
shakalaka shankar
bomma adirindi dimma thirigindi
movie title logo
eluru sreenu