Advertisement

అశోక్ గ‌ల్లా పరిచయ చిత్రంలోని నిధి లుక్!

Tue 18th Aug 2020 07:27 PM
nidhi agerwal,first look,ashok galla,debut film,sriram adittya  అశోక్ గ‌ల్లా పరిచయ చిత్రంలోని నిధి లుక్!
Nidhi Agerwal’s First Look From Ashok Galla’s Debut Film With Sriram Adittya Is Out అశోక్ గ‌ల్లా పరిచయ చిత్రంలోని నిధి లుక్!
Advertisement

అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రంలో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

అందాల తార నిధి అగ‌ర్వాల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రంలో ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో ఆమె నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో నిధి స్టైలిష్‌గా ఉన్న దుస్తుల్లో న‌వ్వు ముఖంతో వెలిగిపోతున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె అశోక్ గ‌ల్లా ప్రియురాలిగా క‌నిపించ‌నున్నారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘య‌మ‌లీల’ చిత్రంలో ఆయ‌న చేసిన ‘జుంబారే’ సాంగ్ స్పెష‌ల్ రీమిక్స్ వీడియో విడుద‌ల చేసిన‌ప్పుడు దానికి అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ 60 శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా ఒక డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. జ‌గ‌ప‌తిబాబు ఒక కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, న‌రేష్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ రావిపూటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తారాగ‌ణం:

అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య‌

సాంకేతిక బృందం:

డైలాగ్స్‌: కల్యాణ్‌ శంకర్‌, ఎ.ఆర్‌. ఠాగూర్‌

మ్యూజిక్‌: జిబ్రాన్‌

సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌

ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి

ఆర్ట్‌: ఎ. రామాంజనేయులు

కాస్ట్యూమ్స్‌: అక్షయ్‌ త్యాగి, రాజేష్‌

పీఆర్వో: బి.ఎ.రాజు, వంశీ-శేఖర్‌

ఎగ్జికూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి

నిర్మాత: పద్మావతి గల్లా

కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య

బ్యానర్‌: అమర్‌ రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

Nidhi Agerwal’s First Look From Ashok Galla’s Debut Film With Sriram Adittya Is Out:

Nidhi Agerwal Birthday special: Her New Film first Look Released

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement