‘వైఫ్ ఆఫ్ రామ్’కు రిలీజ్ డేట్ ఫిక్స్..!

Sat 07th Jul 2018 12:17 PM
  ‘వైఫ్ ఆఫ్ రామ్’కు రిలీజ్ డేట్ ఫిక్స్..!
Wife of Ram Release Date Fix ‘వైఫ్ ఆఫ్ రామ్’కు రిలీజ్ డేట్ ఫిక్స్..!
Sponsored links

ఈ నెల 20న ‘వైఫ్ ఆఫ్ రామ్’

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. విజయ్ యొలకంటి దర్శకుడు. ఇది ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్. ఊహించని మలుపులతో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రీసెంట్ గా ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ లో అఫీషియల్ ఎంట్రీ సాధించిందీ సినిమా. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని ఒట్టావా ఫిలిమ్ ఫెస్టివల్ ‘సోషియల్లీ కాన్సియస్ థ్రిల్లర్’గా పేర్కొనడం విశేషం. ఓ ఎన్.జి.వో. లో పనిచేసే దీక్ష అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త హత్యకు గురవుతాడు. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆ యువతి ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటీ అనేది కథ. ఈ క్రమంలో వచ్చే ఒక్కో సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందంటున్నాడు దర్శకుడు విజయ్.

ఇక ట్రైలర్ తో విపరీతమైన అటెన్షన్ తెచ్చుకున్న 'వైఫ్ ఆఫ్ రామ్' సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ బై ఏ సర్టిఫికెట్ ఇచ్చి మూవీ టీం ను ప్రశంసించారు.

మంచు లక్ష్మి కెరీర్ లో ఇది ఓ మైలురాయి లాంటి పాత్ర అవుతుందని ఇప్పటికే సినిమా చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. మొత్తంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ నెల 20న విడుదల కాబోతోంది ‘వైఫ్ ఆఫ్ రామ్’. 

Sponsored links

Wife of Ram Release Date Fix:

Manchu Lakshmi Wife of Ram Release On July 20

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019